calender_icon.png 20 November, 2024 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టికల్ 370 రద్దుతో మహిళలు, వెనుకబడిన వారికి గౌరవం

05-08-2024 04:43:58 PM

ఆర్టికల్ 370 రద్దై ఐదేళ్లు.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రదాని మోదీ

న్యూఢిల్లీ : దేశ చరిత్రలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆర్టికల్ 370 మరియు 35(A)లను రద్దు చేయాలని భారత పార్లమెంటు నిర్ణయించి 5 సంవత్సరాలు పూర్తవుతోంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ల సర్వతోముఖాభివృద్ధి విషయంలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)ల రద్దుతో మహిళలు, యువత, గిరిజన వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు భద్రత, గౌరవం, అవకాశాలు దక్కుతాయని ప్రదాని తెలిపారు. దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ ను పీడించిన అవినీతిని నిర్మూలన సాధ్యమైందని మోదీ వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధితోపాటు ప్రజల ఆకాంక్షలను నెలవేరుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇస్తున్నాట్లు ట్వటర్ లో రాసుకోచ్చారు.