calender_icon.png 21 February, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన పీఎం

20-02-2025 12:30:02 PM

న్యూఢిల్లీ: దిల్లీ రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకారం(Delhi CM Rekha Gupta Oath Taking) కార్యక్రమం జరుగుతోంది. దిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi), కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.  రేఖాగుప్తా ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. దిల్లీ మంత్రులుగా కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్, పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్, మన్  జిందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్ ప్రమాణం చేయనున్నారు. షాలిమార్ బాగ్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఎమ్మెల్యే రేఖ గుప్తా గురువారం రాంలీలా గ్రౌండ్‌లో జరిగే మెగా కార్యక్రమంలో ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 70 మంది సభ్యుల శాసనసభలో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.