calender_icon.png 19 April, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

17-04-2025 09:44:46 AM

న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) షెడ్యూల్ ఖరారు అయింది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక బహిరంగసభ వేదికను ఎంపిక చేసింది ప్రభుత్వం. అక్కణ్నుంచే పనులను ప్రధాని పున:ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ మొదలు పెట్టారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని కూడా నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణను ఎస్పీజీ బృందం రంగంలోకి దిగింది.