calender_icon.png 21 October, 2024 | 5:58 PM

భారత్ టైం నడుస్తుంది: ప్రధాని మోడీ

21-10-2024 03:53:24 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారత్ ను ఎదుగుతున్న శక్తిగా అభివర్ణించారు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని వెల్లడించారు. ఎన్డీటీవీ నిర్వహించిన ప్రపంచ సదస్సులో మోడీ పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తోందని చెప్పారు. పారిశ్రామిక విప్లవం 4.0 కు భారత్ సిద్ధంగా ఉందన్నారు. 125 రోజుల్లో అనేక నిర్ణయాలను తీసుకున్నామని మోడీ పేర్కొన్నారు. ప్రపంచం దృష్టిలో ఒకే ఏఐ ఉంది. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. దానితో పాటు తమ వద్ద ఉన్న రెండో ఏఐ ఆస్పిరేషనల్ ఇండియా అన్నారు. ఆస్పిరేషనల్ ఇండియా, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిపితే సహజంగానే  అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.

తమకు ఏఐ ఒక సాంకేతికత మాత్రమే కాదు, భారత యువకుల అవసరాలను తీర్చే కొత్త ద్వారం ఉందన్నారు. ఈ ఏడాది భారత్.. "ఇండియా ఏఐ విషన్" ప్రారంభించిందన్నారు. ఆరోగ్యం, విద్య, స్టార్టప్ లు సహా అన్ని రంగాల్లో ఏఐ ఉపయోగాలను విస్తృత పరిచిందన్నారు. ప్రపంచానికి కూడా అద్భుతమైన ఏఐ పరిష్కారాలను అందించే పనిలో తామే ఉన్నామన్నారు. రెండో ఏఐ అయిన ఆకాంక్ష భారత్ విషయంలోనూ అంతే సీరియస్ గా ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి, సామాన్య ప్రజలు, వారి సులభతర జీవనం, ఎంస్ఎమ్ఈలు, యువకులు, మహిళలు సహా అందిరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించాం.. నిర్ణయాలు తీసుకున్నామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.