బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది
మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధిని ఇస్తుంది
పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం
న్యూఢిల్లీ: శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మీడియాతో మాట్లాడుతూ, 2047 నాటికి ‘విక్షిత్ భారత్’(Viksit Bharat) సంకల్పం చాలా కీలకమని ప్రధాని అన్నారు. మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధిని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదల, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయని తెలిపారు. మూడోసారి ఎన్డీయే కూటమి(National Democratic Alliance)కి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మూడో సారి పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్(Budget Session 2025) ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతోందని తెలిపారు.
భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ లో ముందుకెళ్తున్నాం
భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ లో ముందుకెళ్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇన్నొవేషన్, ఇన్ క్లూషన్, ఇన్వెస్ట్ మెంట్(Innovation, inclusion and investment) లక్ష్యంతో దూసుకుపోతున్నామని ఆయన వివరించారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని మోడీ పేర్కొన్నారు. రిఫార్మ్, ఫర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. పార్లమెంటులో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్(Central Budget 2025) ద్వారా ప్రజలకు విశేష లబ్ధి చేకూరుతుందని ప్రధాని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రం, ప్రజల సహకారంతో సంస్కరణలు అమలు జరగాలని ఆకాంక్షించారు. సమృద్ధి, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో బడ్జెట్ సెషన్
శుక్రవారం నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance minister nirmala sitharaman) శనివారం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.రాష్ట్రపతి ప్రసంగం తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు కొద్దిసేపు సమావేశమైన తర్వాత ఆర్థిక మంత్రి శుక్రవారం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు లోక్‌సభ తాత్కాలికంగా రెండు రోజులు (ఫిబ్రవరి 3-4) కేటాయించగా, రాజ్యసభలో చర్చకు మూడు రోజులు కేటాయించారు. ఫిబ్రవరి 6న రాజ్యసభలో చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సమాధానం ఇవ్వనున్నారు.