మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) స్కీమ్‌లో భాగంగా కేంద్రం మంజూరు చేసిన 4వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీజీరెడ్ కో)కు అప్పగించింది.
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఇటీవల తెలంగాణకు 4వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈక్రమంలో రాష్ట్రంలో ప్లాంట్ల కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
టీజీరెడ్‌కో సమన్వయంతో పాటు కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని వెల్లడించింది. ఈ ప్లాంట్లను అనుసంధానించే 33/11 కేవీ సబ్ స్టేషన్ల జాబితాను టీజీ డిస్కంలు తెలియజేస్తాయని తెలిపింది.