25-02-2025 02:37:32 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పీఎం కిసాన్ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. బిహార్‌లోని భాగల్‌పూర్ లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 19వ విడుత నిధులు రూ.22 వేల కోట్లను ప్రధాని విడుదల చేశారు.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఖాతాల్లో డబ్బులు జమ అయింది, లేనిది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. కాగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. మూడు విడుతల్లో రూ.2వేల చొప్పు ఏడాదికి రూ.6వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.