న్యూఢిల్లీ: విద్యుత్ ద్విచక్ర వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఫస్ట్ టైమ్ గరిష్టం గా పది వేల రూపాయల సబ్సిడీ లభించనుంది. తదనంతరం రెండో ఏడాది సబ్సిడీ రూ. 5 వేలకు పరిమితం అవ్వనుంది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు పీఎం ఈ డ్రైవ్ పథకం ప్రవేశపెట్టినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి తెలిపారు. ఫేమ్ స్థానంలో 14335 కోట్లతో రెండు పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వారు పీఎం ఈ డ్రైవ్ పోర్టల్ లో ఆధార్ ఆధారిత ఈ వోచరును జనరేట్ చేస్తారు. దానిపై కొనుగోలుదారులు, డీలర్ ఇద్దరూ సంతకాలు చేసి సదరు పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.