12-03-2025 01:18:30 AM
మంచిర్యాల, మార్చి 11 (విజయక్రాంతి) : మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ లో జిల్లా అధ్యక్షుడు పొట్టాల మల్లేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్లంబర్ డే వేడుకలు నిర్వహించారు. జిల్లా లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అట్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు చల్మటికారి రాజ్ కుమార్, ఉప కార్యదర్శి నూతి వెంకటేశ్వర చారి, సంయుక్త కార్యదర్శి ఎండి మజీద్, కోశాధికారి తోకల అంజయ్య, సలహాదారులు ఆర్ అక్షయ్ కుమార్, పెద్దపెల్లి రవీందర్, ప్రచార కార్యదర్శి ఎం డి ఖాజా, కార్యవర్గ సభ్యులు షేర్ల కనకరాజు, అనుమాండ్ల శ్రీనివాస్, తన్నీరు నరేష్, ఎస్డి అన్వర్, ముక్కెర రామచందర్, వి. శ్రీధర్, ముఖ్య సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.