- కేటాయింపులో అన్నివర్గాలకు ప్రోత్సాహం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5(విజయక్రాంతి): రాష్ట్రంలో యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవా రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సరసమైన ధరలకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయిస్తా మని, ప్లాట్ల కేటాయింపులో అన్నివర్గాలను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నా రు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి, వసతు లు కల్పించి, పరిశ్రమల ఏర్పాటుకు కావల్సి న అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉన్నదన్నారు.
మధిర ఇండస్ట్రియల్ పార్కును రూ.44కోట్లతో 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు వేగ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పార్కు రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలవాలని, ఇతర ప్రాంతాల నుంచి ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించేలా తీర్చిది ద్దాలని సూచించారు. స్వయం సహాయ సం ఘాల మహిళలకు ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. పరిశ్రమలు, వ్యాపారానికి సంబం ధించిన ప్రాజెక్టు రిపోర్టు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతులు కల్పించి పారిశ్రామిక రంగంలో వారిని ప్రొత్సహిస్తామన్నారు. దీనికి మదిర నియోజకవర్గం నుంచే పునాది వేశామన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి చేసు కుని సమగ్ర అభివృద్ధి సాధిస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.
చదువుకున్న అందరికీ ఉద్యోగాలు రావని, గ్రామాల్లో ఉన్న యువత పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రొత్సహించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు ఇప్పిస్తామని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, ఈడీ నిఖిల్ చక్రవర్తి, కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పాల్గొన్నారు.