calender_icon.png 24 November, 2024 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ధ్రువపత్రాలో ప్లాట్ల ఆక్రమణ

24-11-2024 12:36:29 AM

ముగ్గురి అరెస్టు

కరీంనగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించిన నలుగురిపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఫతేపురాకు చెందిన షేక్ అబూబకర్ 1992లో రేకుర్తి శివారులో 8.12 ఎకరాల భూమిని సాలెహ్‌బి నుంచి కొన్నాడు. 1996లో వెంచర్‌గా మార్చి పలువురికి విక్రయించాడు. 311 నంబర్ ప్లాట్‌ను గుర్రం బాలనరేందర్ కొన్నాడు.

దాని పక్క ప్లాట్‌లైన 312, 313లు ఎవరికీ అమ్మకుండా తన వద్దనే అబూబకర్ ఉంచుకున్నాడు. ఆ ప్లాట్లను కాజేయాలనే దురుద్దేశంతో గుర్రం బాలనరేందర్, గుర్రం రాజయ్య, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్‌రావు పతకం ప్రకారం రేకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు ఇంటినంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

అనంతరం సప్లిమెంట్ డీడ్ ద్వారా చీటి ఉపేందర్‌రావు, ఉప్పు శ్రీనివాస్‌ల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తన భూమి కోసం వెళ్లిన అబూబకర్‌ను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో అబూబకర్ పోలీసులకు ఫి ర్యాదు చేశాడు.

పోలీసులు విచారించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. గుర్రం బాలనరేందర్, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్‌రావులను అరెస్టు చేయగా, గుర్రం రాజయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.