15-04-2025 05:42:57 PM
కొనసాగుతున్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 10 రోజుల జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, నాయకులు జీదుల రాములు, అనపర్తి సదానందం, గీస రాములు నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.