calender_icon.png 18 March, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే చేసి నివేదిక ఇవ్వండి

18-03-2025 12:00:00 AM

సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశం 

నిజామాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర శివారులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల భూమి గా ఉన్న ఒక (1-21 )ఎకరం 21 గుంటల భూమి కబ్జాకు గురైన విషయమై పూర్వ విద్యార్థులు గ్రామస్తులు ఆందోళనకు దిగిన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయమై స్థాని కంగా ఉన్న పూర్వ విద్యార్థులు గ్రామస్తులు జరిపిన ఆందోళన విషయాన్ని విజయ క్రాంతి వెలుగులోకి తెచ్చింది.

పక్కాగా రెవెన్యూ రికార్డులలో పాఠశాల ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలానికి ప్రైవేటు భూమి అంటూ కొందరు కబ్జాకు పాల్పడ్డా రూ అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ: కోట్ల విలువైన ‘రూ: కోట్ల విలువైన ప్రభుత్వ భూమినీ రక్షించండి‘ అనే పతాక శీర్షిక న విజయ క్రాంతి సంబంధిత ఫోటోలతో సహా వార్తను ప్రచురించింది.

ఈ వార్తకు స్పందించిన జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధీ హను మంతు వారం రోజుల్లోగా  సర్వే నంబర్ 586/1 లో (1-14.) ఒక ఎకరం 14 గంటల విస్తీర్ణం స్థలం, సర్వే నెంబర్ 586/2 లో 0.7 గుంటల విస్తీర్ణం  భూమిని సర్వే జరిపించ లిసిందిగా ఆర్డిఓ నిజామాబాద్. ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్ నిజామాబాద్‌కి ఎల్‌ఆర్ నెంబర్. E2/95/2025  ఆదేశా లిస్తూ వారం రోజుల్లో సర్వే చేసి  హద్దులను ఏర్పాటు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు.

ఇలా ఉండగా జడ్పిహెచ్‌ఎస్ పాఠశాల భూమిగా చెప్పబడుతున్న భూమిని కబ్జాకు పాల్పడినట్టుగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి న సందగిరి భూమారెడ్డి. సంప్రదించడానికి విజయక్రాంతి ప్రయత్నించగా తాను స్థానికంగా లేనని రెండు రోజుల తర్వాత అందుబాటులోకి వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదుదారులై న జడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులకు గ్రామస్తులకు సంబంధిత శాఖలకు లేఖలు జారీ చేశారు.

ఈ వార్త ప్రచురితమైన నేపథ్యంలో కబ్జాకు పాల్పడిన వ్యక్తులుగా భావించబడుతున్న కొందరు బడాబాబులు పూర్వ విద్యార్థులు అదే గ్రామంలో ఉన్న కొందరు పేదల ఇళ్లలోకి పోలీసు బలాగాలను రెవెన్యూ ఇరిగేషన్  పాలక శాఖ ఇబ్బందిని పపించి తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురి చేశారని వర్గం లోని జై భీమ్ నగర్ కాలనీవాసులు ఆరోపించారు.

పట్ట పగలు ఇళ్లలో నివసిస్తున్న మహిళలను పిల్లలను పెద్దలను సైతం లెక్కచేయకుండా తనిఖీలు నిర్వహించార ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని నిలదీసిన స్థానికులను బెదిరింపులకు పాల్పడ్డారని. తమ నివాసాలకు సంబంధించి సివిల్ సబ్జెక్టులో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని. తమ బలహీన వర్గాల సెక్షన్కు సంబంధించి గౌరవ హైకోర్టు స్టెటస్ కో ఆర్డరు ఉందని చెప్పినప్పటికీని తనిఖీలు జరిపారని కాలని వాసులు తెలిపారు.

ఇదంతా ప్రభుత్వ భూమి కబ్జా కోరులకు వ్యతిరేకంగా పోరాడి నందుకే తమ పై కక్ష సాధింపు చర్యగా పోలీసులు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది తో ముప్పేట దాడి జరిపారని. నిరుపేద నిర్వాసితులు కన్నీటి పర్యంతం విజయక్రాంతికి తెలిపారు.

ఒకవైపు బహిరంగంగా ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని దరఖాస్తులు ఇచ్చి ఆందోళన జరిపినప్పటికిని ఉలుకు పలుకులేని ప్రభుత్వ శాఖలు బడా బాబులకు కొమ్ముకాస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి కేసు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసే యత్నంలో భాగంగానే తమ కాలనీపై హైకోర్టు ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా తనిఖీలు జరిపారని జై భీమ్ నగర్ కాలనీ వాసులు వాపోయారు. గత 18 సంవత్సరాల నుంచి తాము నివాసం ఉంటున్న ప్పటికిని ప్రభుత్వ 58 జీవో ప్రకారం దరఖాస్తులు కూడా రాము చేసుకున్న మనీ వారు తెలిపారు.