calender_icon.png 22 October, 2024 | 2:48 PM

ప్లీజ్.. భయాన్ని వీడండి!

24-06-2024 12:00:00 AM

కొందరిలో చదువు.. పని.. సబ్జెక్టుపై అవగాహన ఉన్నా.. నలుగురిలో మాట్లాడటానికి భయపడుతుంటారు. గ్రూప్‌తో కమ్యూనికేట్ అవ్వడంలో తడబడుతుంటారు. ఫ్రెండ్స్‌తో, తెలిసినవారితో బాగా మాట్లాడినా.. ఏదైనా అవసరమైన మీటింగ్‌లో మాట్లాడమంటే భయపడిపోతారు. నిజం చెప్పాలంటే అవసరమైన సందర్భంలో ప్రతి స్పందించడానికి ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడో ఓ సారి అయితే పర్వాలేదు. కానీ ఎప్పుడూ ఈ విధమైన ప్రవర్తన మానసిక రుగ్మతకు నిదర్శనమని మానసిక వైద్యులు చెబుతన్నారు. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే సెలెక్టివ్ మ్యూటిజం అని కూడా పిలుస్తారు. 

పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావం వల్ల కూడా మానసిక ఆందోళనకు గురవుతుంటారు. బాగా మాట్లాడే వారు కూడా ఒకానొక సందర్భంలో తమలోని టాలెంట్‌ని ప్రదర్శించలేని బలహీనతకు లోనవుతారు. ఈ ‘సెలెక్టివ్ మ్యూటిజం’ డిజార్డర్ బారిన పడినవారు తమ చుట్టూ ఉండే వ్యక్తులు లేదా సమజానికి మధ్య ఏ కారణం లేకుండానే ఒక అవరోధాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇదొక మానసిక రుగ్మతగా చెప్పొచ్చు. 

సోషల్ యాంగ్జుటై..

అన్నీ తెలిసిన కూడా.. నలుగురిలో మాట్లాడటానికి భయపడిపోతుంటారు. చివరికి ఏమీ తెలియని వారిలాగే ఉండిపోతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందుకు కారణం ఇంటర్నల్ అండ్ సోషల్ యాంగ్జుటైస్ కూడా కారణం. వీళ్లు తీవ్రమైన సోషల్ యాంగ్జుటై లేదా ఫోబియాను అనుభవిస్తుంటారు. 

భయానికి కారణం..

భయానికి దారితీసే ‘సెలెక్టివ్ మ్యూటిజం డిజార్డర్’ ఎందుకు ఏర్పడుతుందో తెలియజేసే సైంటిఫిక్ స్టడీస్ అయితే లేవు గానీ సైకాలజిస్టులు కొన్ని కారణాలను గుర్తించారు. ముఖ్యంగా సోషల్ యాంగ్జుటై డిజార్డర్. జర్నలైజ్డ్ యాంగ్జుటై డిజార్డర్ లేదా స్పెసిఫిక్ ఫోబియాస్ వంటివి కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. తరచూ ఆందోళన చెందే మనస్తత్వం కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడటాన్ని కష్టతరం చేస్తుంది. అలాగే సోషల్ ఫోబియా నలుగురిలో మాట్లాడకపోవడం వంటి ‘మ్యూటిజం డిజార్డర్’ వారసత్వగా కూడా రావొచ్చు. ఇదొక మానసిక బలహీనత. ఈ ఫోబియాతో బాధపడుతున్నావారు సహజంగానే మరింత జాగ్రత్తగా ఉండటం, సిగ్గుపడటం, కొత్త లేదా తెలియని పరిస్థితుల్లో భయపడటం చేస్తుంటారు. 

పరిష్కారం ఇదే..

భయాన్ని పోగొట్టడానికి పరిష్కారం ఇదే అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాగ్నెటివ్ యరల్ థెరపీ ద్వారా నలుగురిలో కమ్యూనికేట్ చేయలేని ఆందోళనను, నెగెటివ్ థాట్స్‌ను, ప్రవర్తను గుర్తించి పోగొట్టవచ్చనని నిపుణులు చెబుతున్నారు. థెరపిస్ట్‌లు బాధిత వ్యక్తుల్లో భయాన్ని, బలహీనతను పోగొట్టేలా కౌన్సెలింగ్ ఇస్తారు. దీంతో పాటు బాధితులను సోషల్ ఇంటరాక్షన్స్‌లో భాగస్వామ్యం చేయడం, నలుగురిలో మాట్లాడాలని వారిని ప్రోత్సహించడం వంటివి చేస్తారు.