25-03-2025 12:37:05 AM
స్పీకర్‌కు బీఆర్‌ఎస్ వినతి
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు సంబంధించిన బులెటిన్‌ను అధికారికంగా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. సోమవారం కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా తదితరులు స్పీకర్‌ను కలిశారు. బడ్జెట్ సమావేశాల వరకు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారని, అయినా అధికారికంగా బులెటిన్ ఇవ్వకపోవడం సరికాదన్నారు.
తనను అన్యాయంగా, ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని స్పీకర్‌కు సమర్పించిన లేఖలో జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా స్పందించడం లేదంటూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సస్పెన్షన్‌కు గురైన జగదీశ్‌రెడ్డి అసెంబ్లీకి రావడంతో.. మార్షల్స్ అడ్డుకున్నారు. చీఫ్ మార్షల్ కరుణాకర్‌తో జగదీశ్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.