calender_icon.png 22 February, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు, అసిస్టెంట్ పీపీల నియామకంపై వివరణ ఇవ్వండి

18-02-2025 01:40:09 AM

  1. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  2. విచారణ ఈనెల 24కు వాయిదా

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కింది కోర్టుల్లో అదనపు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోపు వివరణ ఇవ్వాలంటూ సోమవారం హైకోర్టు రాష్ట్ర ప్రభు త్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంలో ప్రభు త్వం ఇంత ఉదాసీనత చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కింది కోర్టుల్లో అదనపు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాసు లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు.

ఇది ఏ ఒక్క వ్యక్తికో.. కోర్టుకో సంబంధించిన అంశం కాదని, పిటిషన్‌ను ప్రజాప్రయోజన పిటిషన్‌గా విచారించాల్సిన అవసరం ఉందంటూ సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ బదిలీ చేశారు. పిటిషన్‌ను తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన ధర్మాసనం విచారించింది.

కింది కోర్టుల్లో కేసుల సత్వర విచారణ అవసరమని, అందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియా మకం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. నియామకంపై వారంలోపు సర్కార్ వివరణ ఇవ్వాలంటూ విచార ణను ఈనెల 24కు వాయిదా వేసింది.