calender_icon.png 17 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లీజ్ అలా అనకండి!

15-11-2024 12:00:00 AM

భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. బంధం బలంగా ఉండాలంటే భార్యలు భర్తలతో ఏం చెప్పాలో? ఏం చెప్పాకూడదో? అనేది కూడా తెలిసి ఉండాలి. అవేంటంటే.. భర్త ఏదైనా రంగంలోనో, వృత్తిలోనో రాణించలేకపోతే ప్రోత్సహించాలి కానీ అవమాన పర్చకూడదు. వీలై తే అండగా ఉండి భుజం తట్టాలి. నీతో ప్రయాణమే నచ్చడం లేదని కొంతమంది అంటుంటారు. ఇది చాలా పెద్ద మాట. ఈ మాటతో వారి బంధమే ప్రశ్నార్థకంగా మారుతుం ది. భర్తను భార్య నువ్వు ఎప్పుడూ నన్న అర్థం చేసుకోలేదని అసలు చెప్పకూడదు. అలా తరచూ చెప్పడం వల్ల భర్తలకు నిరాశ కలుగుతుంది. కొన్నిసార్లు కోపం రావడం సహజం. కానీ ఆ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇద్దరికీ మంచిది.