calender_icon.png 23 January, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులితో చెలగాటం

23-10-2024 12:52:28 AM

మధ్యప్రదేశ్, అక్టోబర్ 22: అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన కొందరు పర్యాటకులు చేసిన అతి వారిపై చిరుతపులి దాడికి దిగేలా చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ అటవీ ప్రాంతంలో ఆదివారం ముగ్గురు స్నేహితలు విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో వారికి కొంతదూరంలో చిరుతపులి కనిపించింది. దానిని తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ.. ఆజా.. ఆజా.. ఆజా(రా.. రా.. రా) అంటూ గట్టిగా కేకలు వేస్తూ చిరుతపులిని కవ్వించారు. దీంతో  చిరుతపులి ఒక్కసారిగా వారివైపు వాయువేగంతో దూసుకురావడంతో వారు పరుగులు తీశారు. అయిననప్పటికీ వెంటాడిన చిరుత వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అక్కడే ఉన్న పలువురు యాత్రికులు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది.