calender_icon.png 10 January, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలతో చెలగాటం..

10-01-2025 01:16:00 AM

కరీంనగర్ సిటీ, జనవరి9: గురుకులల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనపై మొన్న టికి మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలో శైలజ అనే అమ్మాయి మృతిచెందగా దాం తోపాటుగా తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఆ సంగతి మరక ముందే కరీంన గర్ జిల్లాలో బాలికల పాఠశాలలో 32 మం ది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దు ర్మార్గమని శాతవాహన జేఏసీ వ్యవ స్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు.

ప్రభుత్వ ము మొద్దు నిద్ర పోతావుంది ఇలా విద్యా ర్థుల జీవితాలతో చెలగాటం ఆడితే రాబో యే రోజులలో మేము మిమ్ములను గద్దెదిం పే దిశగా పనిచేస్తామని అన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గురుకులాల్లో ఫుడ్ఫాయిన్ తోటి చాలామంది ప్రాణాపా య స్థితిలో చికిత్స పొందుతు న్నారన్నారు. 

ఈ ప్రభుత్వం ఏం పట్టనట్టుగా వ్యవహ రించడం బాధాకరం. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా సీఎం దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజల పైన పేద ప్రజల పైన  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడన్నారు. కార్య క్రమంలో  జేఏ సీ విద్యార్థి నాయకులు నైతం మహేష్, బండ అశోక్, అనుఫ్ రెడ్డి, అరుణ్ తేజ, సయ్యద్ అబ్దుల్ గఫార్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.