calender_icon.png 24 January, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలి

24-01-2025 01:19:18 AM

* రాజీవ్‌గాంధీ పేరుతో పోటీలు నిర్వహించడం హర్షనీయం: సీవీ ఆనంద్

హైదరాబాద్, జనవరి 23 ( విజయక్రాంతి) :  క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు  నేతృత్వంలో నిర్వహిస్తున్న 18వ రాజీవ్‌గాంధీ అండర్ 19 డే నైట్ లీగ్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్స్‌లో భాగంగా గురువారం ఎల్బీస్టేడియంలో మూడో రోజు క్వాటర్ ఫైనల్ మ్యాచ్  శ్రీలంక, తమిళనాడు జట్ల మధ్య జరిగింది.

ఈ మ్యాచ్‌కి ముఖ్య అతిధులుగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్  రంగనాథ్ హాజరయ్యారు. సీవీ ఆనంద్ క్రికెట్ క్రీడారులతో కలిసి కొద్ది సేపు క్రికెట్ ఆడారు. అంతకముందు బౌలింగ్ చేసిన ఆనంద్ క్రీడాకారులను ప్రొత్సహించారు.

సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు 18 ఏళ్లుగా రాజీవ్‌గాంధీ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశమని, అయినప్పటికి రాజీవ్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో వీహెచ్ ఈ పోటీలను నిర్వహిస్తున్నారని కొనియాడారు.

క్రికెట్‌లో మంచి ప్రతిభ కనబర్చి క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని సీపీ సీవీ ఆనంద్   సూచించారు. క్రీడలు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎఫ్‌హెచ్ అధ్యక్షులు ఆది అవినాష్, జనరల్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్‌గౌడ్, సయ్యద్ సాదిక్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. 

నేడు సీఎం చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

క్రికెట్ టోర్నమెంట్స్‌లో విజేతలుగా నిలిచిన టీమ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా శుక్రవారం బహుమతులు ప్రధానోత్సవం చేయనున్నట్లు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు.  ఈ టోర్నమెంట్‌కు వివిధ దేశాలతో పాటు రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల నుంచి టీమ్‌లు పాల్గొన్నాయని తెలిపారు. బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు హాజరవ్వనున్నారు.