మహిళల టీ20 ప్రపంచకప్
ముంబై: అక్టోబర్ నుంచి యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భయపడకుండా మ్యాచ్‌లు ఆడాలని మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సూచించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ టూర్ ఈవెంట్‌లో ఎడుల్జీ పాల్గొంది. ‘2020 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్ ఓడిపోయింది. అప్పుడు ఆసీస్ బ్యాటర్ అలీస్సా హేలీ భారీ ఇన్నింగ్స్‌తో టైటిల్‌ను లాగేసుకుంది. ఆసియా కప్‌లోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. చమేరీ ఆటపట్టు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ట్రోఫీని పట్టుకుపోయింది. జట్టు పరంగా చూస్తే టీమిండియా బలంగా ఉంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మనదే. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి’ అని ఎడుల్జీ పేర్కొంది.