calender_icon.png 23 February, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యర్థాలు బొమ్మలవుతాయి!

23-02-2025 12:00:00 AM

శుభకార్యాలకు, పిల్లలకు ఏదై నా అకేషన్స్‌కు ఇచ్చే బహుమతులకు అర్థం పరమార్థం ఉండాలని భావించారు కర్ణాటకకు చెందిన సునీతా, సుహాస్ దంపతులు. గిఫ్ట్స్ ద్వారా కొందరి జీవితాలలోనైనా ఉపాధి వెలుగు నింపా లని డిసైడ్ అయ్యారు. ఆ ఉద్దేశ్యంతోనే ఈ ఇద్దరు దంపతులు ‘ది గుడ్ గిఫ్ట్స్’ను స్థాపించారు. చిన్నతనం నుంచే బొమ్మల పట్ల ప్రేమ ఉన్న సునీత తన కళనే ఆదాయ వనరుగా మార్చి మరెందరికో ఉపాధి మార్గం చూపుతున్నది.

ఈ జంట 2017లో బెంగళూరు నుంచి నీలగిరికి వచ్చి.. అక్కడ ఆదివాసి మహిళల కష్టాలను చూశారు. వారికోసం ఏదైనా చేయాలి అనుకున్నారు. అందులో భాగంగా ‘ఇండియన్ యారడ్స్ ఫౌండేషన్’ ను స్థాపించి 8,000 కిలోల వ్యర్థాలను ఫ్యాబ్రిక్ బొమ్మలుగా మార్చారు. ఆదివాసీ మహిళల జీవితాలను మార్చారు. వారికి బొమ్మలు తయారుచేయడం నేర్పించారు.

ప్రస్తుతం ఆ మహిళలు రెండు వేల నుంచి పది వేల వరకూ సంపాదిస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 230 మంది ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. ప్రతిరోజూ 3,000 బొమ్మలను అమ్ముతున్నారు. ఈ ఫౌండేషన్‌కు 2024లో రూ.75 లక్షల ఆదాయం వచ్చింది. సునీతా వ్యాపారం మాత్రమే కాకుండా వ్యర్థాలతో పర్యావరణాన్ని కాపాడుతూ.. మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏది లేదని నిరూపించారు.