రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గిన వినేశ్
ఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆట ముగిసిపోలేదని.. 2032 వరకు రెజ్లింగ్‌లో కొనసాగుతానంటూ వినేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్ అనూహ్యంగా అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో వినేశ్ ఉన్నపళంగా రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికి అందరిని షాక్‌కు గురి చేసింది.
అనర్హత వేటుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ను ఆశ్రయించిన వినేశ్ తనకు రజతం ఇవ్వాలని అప్పీల్ చేసుకుంది. కానీ వినేశ్ అప్పీల్‌ను కాస్ తిరస్కరించడంతో నిరాశే ఎదురైంది. తాజాగా గురువారం ఎక్స్ వేదికగా వినేశ్ స్పందిస్తూ.. ‘నా ఆట ఇంకా అయిపోలేదు. ఈ ఒలింపిక్స్ నాకు కలిసి రాలేదు.. విధి, సమయం నాతో ఆడుకున్నాయి. కుటుంబసభ్యులకు, భారతీయులకు చెప్పదలచుకున్న విషయం ఏంటంటే.. నా గోల్ ముగియలేదు. మేము అనుకున్న పని అసంపూర్తిగా మిగిలిపోయింది. కానీ 2032 వరకు మా త్రం రెజ్లింగ్‌లో కొనసాగే అవకాశముంది’ అని వినేశ్ రాసుకొచ్చింది.