calender_icon.png 14 February, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఉపయోగపడని వేదికలు

14-02-2025 01:38:44 AM

లక్షలు వెచ్చించి నిర్మాణం... వృథాగా ఉన్న రైతు వేదికలు

వనపర్తి, ఫిబ్రవరి 13 ( విజయక్రాంతి ) : రైతు సంక్షేమానికి గత  ప్రభుత్వం రైతు వేదిక లు నిర్మించనప్పటికీ అవి నేడు వృధాగా మిగిలి పోతున్నాయి. లక్షలు వెచ్చించి వన పర్తి జిల్లా లో ప్రతి 5 వేల మంది మంది రైతులకు ఒక రైతు వేదిక చొప్పున మొత్తం 71 రైతు వేదికను నిర్మించారు. రైతు వేదికలో వ్యవసాయ అధికారులు రైతులకు అను నిత్యం శిక్షణలు ఇవ్వాలి. రబి , ఖరీప్ లో ఏ పంటలు వేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు శిక్షణ ఇవ్వాలి.

ఇవేమి పట్టించు కోకుండా వ్యవసాయ అధికారులు రైతు వేదికను కన్నెత్తి చూడటం లేదని విమ ర్శలు ఉన్నాయి. ఎక్కడ కూడా రైతు వేదికల్లో రైతులకు శిక్షణ ఇచ్చిన ధాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం హ యాంలో రైతు సమన్వయ అధ్యక్షులుగా ని యమించారు. వారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. వారి కాల పరిమితి పూర్తి కావడంతో వారు పట్టిం చుకోవడం లేదు.

వ్యవసాయ విస్తీర్ణ అధికా రులు పలాన గ్రామాలు తిరిగామని, రైతుల కు కలిసి శిక్షణ ఇచ్చామని ఫోటోలకు ఫోజు లిస్తున్నారని తప్ప వారికీ సరైన శిక్షణ ఇవ్వ డం లేదన్న విమర్శలు ఉన్నాయి . భూసార పరీక్షలు చేయాలనీ ఆదేశాలిచ్చినప్పటికి భూసార పరీక్షలు చేసిన ధాఖలాలు లేవు. ప్రతి మండల కేంద్రానికి వ్యవసాయ అధికా రులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులున్నప్ప టికి రైతు వేదికలు వెళ్లి రైతుల బాగోగుల గురుంచి పట్టించుకున్న ధాఖలాలు లేవు.

అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో రైతు వేదికలు నిర్మించినప్పటికీ ఇప్పుడు నేను రైతు వేదికల్లా తాళం వేసి వృధాగానే పడి ఉన్నాయి. గిరిజన రైతులకు ఏ సీజన్ లో ఏ పంటల వేయాలో తెలియక వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

వ్యవసాయ అధికారులు సైతం రైతు వేదిక ఉన్న పంటల మార్పిడి పంటల సాగు వంటి వాటిపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన అభ యం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి ప్రత్యేక చొరవ తీసుకొని రైతు వేదికలో రైతులకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.