calender_icon.png 22 April, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనేకల్‌లో విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ

21-04-2025 11:23:47 PM

తాడ్వాయి,(విజయశాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో సోమవారం వంద మంది విద్యార్థులకు 100 ప్లేట్లు ప్రతినిధులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన గడ్డం చిన్న రాంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గడ్డం కిష్టారెడ్డి 100 మంది విద్యార్థులకు 100 ప్లేట్లు పంపిణీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతోనే ప్లేట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశాజ్యోతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాను ప్రకాష్ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, సాయిరెడ్డి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.