06-03-2025 07:25:34 PM
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి...
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ఆమె గురువారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.