25-03-2025 01:02:27 AM
కల్లూరు, మార్చి 24 :-వేసవిలో ఎండవేడిమి,వడ గాడ్పుల నుండి పామాయిల్ మొక్కలకు రక్షణ గా మొక్క చుట్టూ మీటర్ వెడల్పు లో పాదులు చేసి ఆ పాదుల చు ట్టూ జనుమ విత్తనాలు నాటాలని కల్లూరు, పెనుబల్లి మండలాల ఉద్యాన శాఖ అధికారి జి.నగేష్ తెలిపారు.
జూన్ 20 వ తారీకు వరకు జనుము ఎదుగుదలను కొనసాగించి. తదుపరి జనుమును చిన్న ముక్కలుగా చేసి పామాయిల్ మొక్కల చుట్టూ వేసి మట్టిలో కలియ తిప్పడం వల్ల మొక్కలకు ఎరువుగా ఉపయోగ పడుతుందని అయన తెలిపారు.