నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో వనమోహత్సవంలో అన్ని శాఖల అధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో 2025-26 సంవత్సరనికి గాను మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలోని పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు పెంచాలని సూచించారు. జిల్లాలో 69 లక్షల 55,3 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే కార్యక్రమంపై లక్ష్యాలను నిర్దేశించిన జరిగిందని తెలిపారు. ఇందుకోసం అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఫైజాన్ అహ్మద్ డిఎఫ్ఓ భాను, డిఆర్డిఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.