13-04-2025 01:42:18 AM
మంత్రి తుమ్మల
ఖమ్మం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రెడ్డిగూడెం గ్రామంలో వనజీవి రామయ్య మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామయ్య తన జీవితంలో చివరి క్షణం వరకు మొక్కలు నాటారని తెలిపారు.