ప్రాంతీయ సంచాలకులు వరంగల్ మున్సిపల్ షాహిద్ మసూద్..
మందమర్రి (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రాంతీయ సంచాలకులు పురపాలకశాఖ వరంగల్ షాహిద్ మన్సూద్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చెతలపూర్ లో గల డంపింగ్ యార్డ్ ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి మాట్లాడారు. మున్సిపాలిటీ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ లోనీ బయో మైనింగ్ సైట్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్, ప్రజారోగ్య శాఖ సర్కిల్, వరంగల్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డివిజన్, అదిలాబాద్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ టి రాజలింగు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, సానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, రెవెన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బంగారి శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం గోపికృష్ణ, బయో మైనింగ్ సైట్ నిర్వాహకులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.