18-03-2025 06:07:23 PM
తాడ్వాయి (విజయక్రాంతి): నర్సరీలలో మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో సాజిద్ అలీలు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల, సంతయిపేట గ్రామాలలో అధికారులు మంగళవారం నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.