calender_icon.png 24 October, 2024 | 7:50 AM

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

09-07-2024 04:16:15 AM

  • వన మహోత్సవం ప్రారంభంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 
  • రామంతాపూర్‌లో మొక్కలు నాటిన మంత్రి, మేయర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): మొక్కలను నాటడం, వాటిని కాపాడడం సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బీ లక్ష్మా రెడ్డి, కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి సోమ వారం రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొక్క లను నాటారు.  ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొక్కలు నాటడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. 

ప్రభుత్వం భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణం అందించే లక్ష్యంతో వన మ హోత్సవం కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందని అన్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 30 లక్షల మొక్కలను నాటేందుకు కార్యాచరణ రూ పొందించామని వెల్లడించారు. అందులో భాగంగా సోమవారం జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో  7,134 మొక్కలు నాటినట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అందుకు ప్రజల సహకారం ఉంటేనే అవి విజయవంతం అవుతాయన్నారు.

అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో గత ంలో మొక్కలు నాటిన కారణంగా హైదరాబాద్ నగరానికి గ్రీన్ అవార్డు వచ్చిం దన్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 లోనే 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్టు గుర్తించిందని తెలిపారు. కార్యక్రమంలో అంబర్‌పేట, హబ్సీగూడ, ఉప్పల్, మల్లాపూర్, చిలుకానగర్, చర్లపల్లి, మీర్‌పేట, హెచ్‌బీ కాలనీ, నాచారం కార్పొరేటర్లు పాల్గొన్నారు.