calender_icon.png 24 November, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొంగులేటిని కలిసిన బాలు నాయక్

24-11-2024 02:49:03 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో గల ఎన్ఎండీసీలో ప్లాంట్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ బాలు నాయక్ నవంబర్ 30న పదవీ విరమణ పొందునున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే రిటైర్మెంట్ ఫంక్షన్ కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో  ఆదివారం కలిసి పుష్పగుచ్చం అందజేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాలె జానకి రెడ్డి, భావ్ సింగ్ నాయక్, జగదీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.