18-02-2025 01:32:05 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లాలోని ఆయా మండ లాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంసీఓలతో సోమవారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
మొక్కల పెంపకానికి అవసరమైన అన్ని సమకూర్చు కోవాలని చెప్పారు. డీఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై కలెక్టర్ సమీక్షించారు. ఎంపీడీఓలు, ఎంఎస్‌ఓలు జాబితా పరిశీలన, గ్రౌండి్ంప దృష్టిపెట్టాలని చెప్పారు.
అర్హుల గుర్తింపులో తప్పులకు తావులేకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే ఆమోదించిన మొదటి జాబితాను తక్షణమే కలెక్టర్ లాగిన్ కు పంపించా లన్నారు. అంతకుముందు ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి 25 ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు, ఎంపీడీఓలు మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.