calender_icon.png 16 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ జ్ఞాపకంగా మొక్క నాటండి

12-07-2024 01:00:00 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని.. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా ప్రతి ఒక వ్యక్తి చెట్టు నాటాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బీజెపీ కార్యాయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మ గౌరవాన్ని పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్క నూ సంరక్షించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలన్నారు. కాంక్రీట్ జంగిల్ మారుతున్న మన పరిసరాలను కాపాడుకునే బాధ్యత మనపై ఉందన్నారు. పచ్చదనాన్ని పరిరక్షిస్తేనే ప్రకృతి వైపరీత్యాలు తగ్గుతాయని అన్నారు. అడవులు తరిగిపోవడం భవిష్యత్తుకు ఒక పెను సవాల్ లాంటిదన్నారు.