- * స్వయం సహాయక సంఘాల ద్వారా 1,000 మెగావాట్లు ఉత్పత్తి
- * త్వరలోనే టెండర్లు ఖరారు చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలు
- * జిల్లాలో 150 ఎకరాలు తగ్గకుండా ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
- * ఇటీవల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్
వనపర్తి, జనవరి 10 ( విజయక్రాంతి ) : మహిళల సాధికారతే ధేయ్యంగా ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలతో ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి దిశగా చేసే ప్రయత్నాలకు ప్రభుత్వ అడుగు లు వేస్తుంది. దీంతో వనపర్తి, గద్వాల జిల్లా లలో సోలార్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తితో సోలా ర్ వెలుగులు విరజిమ్మనున్నాయి.
కార్య క్రమం క్రమ పద్ధతుల జరగాలంటే స్వయం సహాయక సంఘాల ద్వారనే సాధ్యమైతుం దని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల ఉత్పత్తికి ఇప్పటికే ఇందన శాఖ, గ్రామీణ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. సోలార్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తికి సంబంధించి భూమిని రాష్ర్ట ప్రభుత్వమే సమకూర్చడంతో జిల్లాలలో సౌర వెలుగు లు వెలుగనున్నాయి.
జిల్లాలో 150 ఎకరాల తగ్గకుండా ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా జిల్లాలలో సౌర వెలుగులు అందించాలంటే ప్రతి జిల్లా పరిధిలో 150 ఎకరాలకు తగ్గకుండా ప్లాం ట్లను ఏర్పాటు చేసేలా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు చొరవ తీసుకునేలా స్థలాలను గుర్తించే పనిలో ఉండాలని ఈనె ల 8వ తేదిన గ్రామీణ అభివృద్ధి శాఖ మం త్రి సీతక్క, సంబంధిత అధికారులతో కలిసి రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.
ఈ నేపద్యంలో రాష్ర్ట ప్రభు త్వం ఇద్దరమ్మాయిల శక్తి పథకంలో భాగం గా 17 రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పి స్తుంది. ప్రభుత్వ స్థలాలలో మహిళా సంఘా ల ద్వారా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయ నుంది. మహిళా సంఘాలకు భూములను తక్కువ ధరకు లీజ్ కు కేటాయించి ఒక మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారుగా నాలుగు ఎకరాల స్థలం తగ్గకుం డా ఒక్కో ప్లాంటుకు పరిశాతం మహిళా సంఘాలు చెల్లిస్తే 90% బ్యాంకు రుణాన్ని ఇప్పించనున్నారు.
త్వరలోనే టెండర్లు ఖరారు చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలు
సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యు త్పత్తికి సంబంధించి స్థలం కేటాయింపు, మహిళా సంఘాల చెల్లింపు, బ్యాంకు రుణా ల మంజూరు వంటి ప్రక్రియ కార్యక్రమాన్ని త్వరలోనే టెండర్లు ఖరారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
మహిళలకు పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు పెద్దపిట్ట వేస్తుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తు న్నాం. మహిళలను కోటేశ్వరులుగా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యాంటీన్, త్వరలోనే మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు నాంది పలికింది.
మరొక అడుగు ముందుకు వేసి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు సాగేలా ప్రణాళికలు రచించి అందులో మహిళా సంఘాల స భ్యులకు ప్రాధాన్యతను ఇవ్వనున్నాం.
తూడి మేఘారెడ్డి, వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు