calender_icon.png 16 January, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరాభివృద్ధికి ప్రణాళికలు

31-08-2024 02:45:23 PM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం,(విజయక్రాంతి): నగరాన్ని ప్రణాళికాబద్ధంగాఅభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి నగరంలోని 34వ డివిజన్ లోని బురదరాఘవపురంలో రూ. 195 లక్షల వ్యయంతో నిర్మించనున్న మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. రోజువారి పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునకొల్లు నీరజ,  కార్పొరేటర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.