calender_icon.png 3 April, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లానింగ్ తప్పనిసరి!

23-03-2025 12:00:00 AM

మనం ఆఫీసుకు వెళ్లేదే పని చెయ్యడం కోసం.. కానీ కొన్నిసార్లు రోజంతా పూర్తి స్థాయిలో పనిచేయలేం. ఇది ఒక రోజుకే కాదు వారానికీ వర్తిస్తుంది. వారంలో ఒక్కోరోజు మన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని రోజులు తక్కువగా ఉంటుంది. వీటిని గమనించి, దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలంటున్నారు నిపుణులు. 

వీకెండ్ సెలవు తర్వాత బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజులు ప్రణాళిక వేసుకోవడం, లిస్ట్‌ని తయారు చేసుకోవడం వంటివి చేయాలి. తర్వాతి రోజును కష్టంగా ఉన్న పనులు, ఖచ్చితంగా పూర్తి కావాల్సిన పనులకు కేటాయించాలి. దీంతో ఉత్పాదకత బావుంటుంది. వారం మధ్య నుంచి మళ్లీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా మీటింగ్స్, ప్రజెంటేషన్స్ ఉంటే పూర్తి చేసుకోవాలి. తర్వాత వీకెండ్ దగ్గరకి వచ్చేసరికి ఉత్సాహం పెరుగుతుంది. దీంతో వారం మొత్తం పెండింగ్ పెట్టుకున్న పనులు, తర్వాతి వారంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పనులకు కేటాయిస్తే వేగంగా పూర్తి చేయగలుగుతారు.