calender_icon.png 24 February, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈజీఐఎస్‌తో ప్రణాళిక శాఖ ఒప్పందం

18-02-2025 01:33:13 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడంతోపాటు ఆదాయాన్ని మెరుగుపర్చేందు కు సీఈజీఐఎస్ ఫౌండేషన్‌తో రాష్ర్ట ఆర్థిక, ప్రణాళిక శాఖ ఒప్పందం చేసుకుంది. సోమవారం సచివాయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగిన ఒప్పందం రానున్న ఐదేళ్ల వరకు కొనసాగనుంది.

గతంలో 2019 నుంచి 2024 మధ్య తొలి దఫా ఒప్పందం జరగ్గా.. ఇది రెండోది. సీఈజీఐఎస్ ప్రాథమికంగా రాష్ర్ట ఆదాయం పెంచడంతో పాటు, విద్యుత్ వినియోగాన్ని విశ్లేషించడంలో ప్రభుత్వానికి సాయపడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా వ్యయాన్ని తగ్గించడం, పవర్ కొనుగోలు అగ్రిమెంట్లు తదితర విషయాల్లో మద్దతుగా నిలవనుంది.

2019 ఒప్పందం ద్వారా ప్లానింగ్, ఆర్థిక, విద్య తదితర విభాగాల్లో సమస్యలను పరిష్కరించింది. సీఈజీఐఎస్ ప్రస్తుతం తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, అస్సాం ప్రభుత్వాలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.