calender_icon.png 10 March, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం

10-03-2025 12:17:50 PM

రాజేంద్రనగర్: శంషాబాద్ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) గోవా నుంచి వచ్చిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఇ6973 విమానం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి విశాఖపట్నం(Goa to Visakhapatnam) వెళ్తోంది. శంషాబాద్ నుంచి వెళ్లే క్రమంలో  ఎటిసి అధికారులు ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు. ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో ఎటిసి అధికారులు హైడ్రాలిక్ గేర్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం టేకాఫ్ అవుతుండడం గమనించిన పైలెట్ వెంటనే రివర్స్ టేకాఫ్ తీసుకున్నాడు. విమానం గాల్లోకి లేవడంతో పెను ప్రమాదం తప్పింది. గాలిలో పది నిమిషాలు పాటు విమానం చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయింది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొద్దిసేపటికి విమానం తిరిగి విశాఖపట్నం వెళ్లిపోయింది.