27-02-2025 12:43:25 AM
46 మంది మృతి
నివాసాల మధ్యలో కుప్పకూలిన సైనిక విమానం
మృతుల్లో 17 మంది మిలటరీ ఆఫీసర్లు.. 29 మంది పౌరులు
ఖార్టూమ్, ఫిబ్రవరి 26: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒమ్‌డూర్‌మాన్ ప్రాంతంలో మిలటరీ వి మానం కూలిపోవడంతో 46 మంది ప్రా ణాలు కోల్పోగా.. 10 మందికి గాయాలపాలయ్యారు. వాయి సయిద్నా వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన ఓ మిలటరీ విమానం కాసేపటికే జనావాసాల మధ్యలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కొంత మంది ఇండ్లు కూలిపోగా.. మరికొన్ని ఇండ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మృతుల్లో మేజర్ జనరల్ స్థాయి అధికారి, సీనియర్ కమాండర్ కూడా ఉన్నా రు. సైనికులతో పాటు సామాన్య పౌరులు కూడా మరణించినట్లు మిలటరీ అధికారు లు ధృవీకరించారు.
ప్రమాదం జరిగిన వెం టనే అధికారులు సహాయక చర్యలు చేపట్టా రు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ న్యాలాలో సైనిక విమానాన్ని కూల్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమ నార్హం. చాలా రోజుల నుంచి సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. తాజా ప్రమాదానికి ఈ గొడవలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.