calender_icon.png 23 December, 2024 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెజిల్‌లో విమాన ప్రమాదం

23-12-2024 02:30:41 AM

పదిమంది దుర్మరణం

రియోడిజనీరో, డిసెంబర్ 22: బ్రెజిల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది చనిపోయారు. స్థానిక అధికారులు తెలిపిన ప్రకారం కొంతమంది విదేశీయులు ఆదివారం దక్షిణ బ్రెజిల్‌లోని  పర్వత ప్రాం తంలో ఉన్న టూరిస్ట్  కేందమ్రైన గ్రామాడోకు చిన్న విమానంలో వెళుతున్నారు. ఈ క్రమంలో గ్రామాడోలో ఉన్న దుకాణాల్లోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. దీంతో మంటలు తలెత్తాయి. వారంతా మరణించి ఉంటారని, ఒక్కరూ కూడా బతికే అవకాశం లేదని స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన 15 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.