calender_icon.png 27 October, 2024 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాల కోసం స్థల పరిశీలన

13-08-2024 03:12:28 AM

మల్లాపూర్‌లో 22 ఎకరాల గుర్తింపు

యాదాద్రి భువనగిరి, ఆగస్టు12 (విజయక్రాంతి): జాతీయ వైద్య మండలి మార్గదర్శ కాల ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతుల కోసం దరఖాస్తులు చేయగా నాలుగింటికి అనుమతులు ఇస్తూ మరో నాలుగింటిని అవసరమైన సదుపాయాలు లేవనే కారణంగా తిరస్కరించింది. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాల ఒకటి.

జాతీయ వైద్య మండలి తిరస్కరణకు గల అంశాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య విద్యామండలి, జిల్లా అధికార యంత్రాంగం మెడికల్ కళాశాలకు అవసరమైన వసతులు, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత భవనం, అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి యాదగిరిగుట్ట సమీపంలోని మల్లాపురంలోని 22 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతు కే జండగే, రెవెన్యూ అధికారులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు.