calender_icon.png 24 October, 2024 | 2:26 PM

జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి

24-10-2024 12:10:09 PM

మున్సిపల్ కమిషనర్ కు  వినతి పత్రం అందజేసిన నాయకులు 

కరీంనగర్, (విజయక్రాంతి): ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కి గురువారం నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సరిల్ల రతన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,  ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.  

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివంగత నేత జగపతి రావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని కోరారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా తాము మీ ప్రతిపాదన తమరికి సమర్పిస్తున్నామని వివరించారు , వెలిచాల జగపతి రావు గారు, 1972 నుంచి 1977 వరకు జగిత్యాల నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా, 1978 నుండి 1984 వరకు శాసనమండలి సభ్యులుగా పనిచేశారని తెలిపారు. 1989 నుండి 1994 వరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభ్యుడిగా పనిచేశారని వివరించారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఆయన్ను ప్రజాబంధుగా గౌరవించారని, పేదల కోసం నిరంతరం హరితపించిన మహా నేత జగపతిరావు అని వివరించారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదేని యోగ్యమైన ప్రదేశంలో కరీంనగర్ ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన మహా నాయకులు జగపతిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు  అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గండి రాజేశ్వర్, మాజీ నగర ప్రధాన కార్యదర్శి సరిళ్ళ రతన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండి శ్యామ్, పులి నరసింగం, కాసారపు కిరణ్, గండి గణేష్, పెద్ది రవి తదిరులు ఉన్నారు.