11-03-2025 12:45:36 AM
భద్రాద్రి వాసులకు సన్మానం
భద్రాచలం, మార్చి 10 (విజయక్రాంతి): సామాజిక సేవ ఆధ్యాత్మిక రంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది, అందులో భాగంగానే లండన్ బుక్ ఆఫ్ రికారడ్స్ లో స్థానం సంపాదించిన హరిత మిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, డాక్టర్ కృష్ణ చైతన్య లను భద్రాచలం లోని గోవింద కల్ప వృక్ష నరసింహ సన్నిధి లో జరిగిన ఎల్. సి. ఇ.ఎఫ్ ఫౌండేషన్ ఒంగోలు వారి సౌజన్యం తో జరిగిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ కృష్ణ చైతన్య, హరిత మిత్ర లయన్ గోళ్ళ భూపతి రావు వంటి ఆలోచన విధానం కలిగిన వారు సమాజానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువలను తెలియచెప్పాలి అనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడారు.
ధర్మవంతమైన ఆలోచన విధానం నేటి యువతరానికి ఎంతో అవసరమని అటువంటి యువతకు కూడా పర్యావరణ పట్ల అవగాహన కల్పిస్తూ ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని యెల్. సి.ఇ.యఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు భుచ్చేస్వర రావు వారి సభ్యులు అభినందించారు , వీరి సేవలు మరెందరి కో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అభినందిస్తూ హరిత మిత్ర లయన్ డాక్టర్ గోళ్ల భూపతి రావు మరియు డా . కృష్ణ చైతన్య.లను ఘనంగా సన్మానించారు పూలతో సత్కరించి కిరీటి దారణ చేశారు
అంతేకాకుండా వీరితో పాటు సేవా సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబరిచి జాతీయ పురస్కారం అందుకున్న భద్రాద్రి ప్రముఖులు బిర్రు సుధాకర్, లకవాత్ వేంకటేశ్వర్లు (ప్రజాసేవ) , చంద్రశేఖర్, రాజశేఖర్ (పర్యావరణం), భూషణ్ రావు (సమాజసేవ) , తిరుమల రావు పర్యావరణం, రఫీ ఆర్ట్ ఆఫ్ లివింగ్, తాతోలు దుర్గా చారి సాహిత్యం కడలి నాగరాజు సమాజసేవకులకు జాతీయ సేవరత్న అవారడ్స్ మరియు కూచిపూడి రంగంలో ప్రతిభ చూపిన నాట్య గురువు కుమారి జయ మాధురి వారి శిష్య బృందంనకు పురస్కారాలు.
అలాగే వివిధ ప్రాంతాల నుండి కూచిపూడి భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారు లకు మేమేంటోలు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో మాధవ రావు, శ్రీమతి శ్రావణి, శ్రీలక్మి , ఆకివేటి సరోజీ మరియు శ్రీ నజీర్ అహమ్మద్ పాల్గొన్నారు.