హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి యాభై రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని డీఎస్సీ -2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 200మంది మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చి వారి గోడు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడారు.
అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ తుదిదశలో ఉన్నదని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే లా చూస్తానని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ-2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, కార్యదర్శి మెరుగు భాస్కర్, ప్రమీల, మహేశ్వరి, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.