calender_icon.png 13 January, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజేఆర్ సేవలు చిరస్మరణీయం

13-01-2025 12:33:51 AM

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు, జనవరి 12 : బడుగు బలహీనవర్గాలకు పీజేఆర్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కార్మిక నాయకులు దివంగత పీ జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పటాన్ చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి పీజేఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్, సంజీవ్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడు పీజేఆర్ 

కార్మికుల పక్షాన నిరం తరం పోరాడిన గొప్ప నా యకుడు పీజేఆర్ అని కాం గ్రెస్ మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అ న్నారు. పీజేఆర్ జయంతి సందర్భంగా చిట్కుల్ లోని జీటీఎన్ టెక్స్ టైల్ పరిశ్ర మ ఆవరణలోని ఆయన విగ్రహానికి కార్మికులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ సీఎల్పీ నేతగా, కార్మిక నాయకునిగా పీజేఆర్ విశేష సేవలందించారన్నారు. ఆయన స్ఫూర్తిగా పనిచేస్తానని నీలం మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీటీన్ పరిశ్రమ కార్మికులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.