12-03-2025 10:58:46 PM
పిట్లం,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ బాడీ సమావేశం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్యకు చెందిన ఈసి సభ్యులు, పదాధికారులను పాల్గొని నూతన మహిళా సమాఖ్య కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి గా ఏపీఎం రాం నారాయణ్ గౌడ్ హాజరై, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.అధ్యక్షురాలుగా నాగమణి, బొల్లాక్ పల్లి, కార్యదర్శి శ్యామల బూర్నపూర్, కోశాధికారి అర్షియా ఫాతిమా పిట్లంను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహభరితంగా పాల్గొని, తమ సంఘానికి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సమావేశం మహిళా సమాఖ్య భవిష్యత్తు అభివృద్ధికి పునాది వేస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.