- రెండున్నర గంటలు కరెంట్ కోత
- ఆపరేషన్ నిలిపేసిన వైద్యులు
- చీకట్లోనే బాలింతలు, గర్భిణులు
మంచిర్యాల, జూలై 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలకుపైగా ఎంసీహెచ్ అంధకారంలో ఉండిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎంసీ హెచ్‌కు వచ్చే విద్యుత్ కేబుల్ చెడిపోవడంతో బుధవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల నుంచి 11.30 గంటల వరకు కరెంట్ సరఫరా కాలేదు.
కరెంట్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన గర్భిణీని వాపసు తీసుకువచ్చారు. ఐసీయూలో ఉంచిన చిన్న పిల్లలను కుటుంబ సభ్యులు బయటకు తీసు కురాగా.. బాలింతలు, గర్భిణులు చీకట్లోనే ఉక్కపోతతో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో ఇబ్బందులు పడ్డారు. ఎంసీహెచ్‌కు ఎలక్ట్రిషియన్ లేకపోవడంతో జిల్లా ఆస్పత్రి సిబ్బంది వచ్చి నూతన కేబుల్ వేయడంతో విద్యుత్ సరఫరా జరిగింది.