29-03-2025 12:27:55 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, మార్చి 28: (విజయక్రాంతి): డివిజన్లో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం చిక్కడపల్లి సంజీవయ్య నగర్ బస్తీలో ఇటీవల రూ. 3.10 లక్షల వ్యయం తో ప్రారంభించిన నూతన మంచినీటి పైప్ లైన్ పనులను బీజేపీ శ్రేణులు, బస్తి వాసులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మాట్లాడు తూ బస్తీలో ఉన్న రెండు వీధుల్లో ఇప్పటికే ఒక వీధిలో పైప్ లైన్ పనులు పూర్తి అయ్యాయని, పెండింగ్ లో ఉన్న మరో వీధి పనులకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జలమండలి అధికారులపై ఒత్తిడి పెంచి మంజూరు చేయించామన్నారు.
మంచినీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టామన్నారు. నీటి కొరత ఏర్పడకుండా పనులు పూర్తున వెంటనే మెరుగైన మంచినీటి సరఫరా ప్రజలకు అందించాలన్నారు. పనులు ఆలస్యం కాకుండా త్వరగతి నా పూర్తి చేసి నీటి సరఫరాను అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమా ర్, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఎం.ఉమేష్, మద న్మోహన్, డి. కుమార్, జ్ఞానేశ్వర్, సాయి కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, నీరజ్, ప్రశాంత్, రాజ్‌కుమార్, బస్తి నాయకులు రమేష్, రాజయ్య, పి.అనిల్, విజయ్, చింటూ, లావణ్య, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.